Saturday, November 23, 2024

19 సంవత్సరాలలోపు పిల్లలకి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ఈనెల 20న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒకటి నుండి 19 సంవత్సరముల లోపు వయసు గల ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి వైద్య అధికారులను ఆదేశించారు.శనివారం భువనగిరి కలెక్టరేట్ మీటింగ్ హాలులో వైద్య ఆరోగ్య అధికారులతో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున చేపట్టవలసిన చర్యలపై, మిషన్ ఇం ద్రధనుస్సు కార్యక్రమంపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈనెల 20 న అంగన్వాడీలు, ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలలో ఒకటి నుండి 19 సంవత్సరాల వ యస్సు కలిగిన ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలు వేయాలని, ఆరోజు ఎవరైనా మాత్రలు వేసుకోని వారు ఉంటే తిరిగి ఈ నెల 27 న వేయాలని తెలిపారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలు ఒక డోస్ కూడా వేసుకొని డ్రాప్ అవుట్ పిల్లలు, అసలు ఏ డోస్ కూడా వేసుకొని మిస్సింగ్ పిల్లలను ఈ నెల 20వ తేదీలోపు ఆశా, ఏఎన్‌ఎంలు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది సహకారంతో సర్వే చేసి గుర్తించి వాక్సిన్ అందించాలని తెలిపారు.

సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున రావు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నా నాయక్, వైద్యాధికారులు, వైద్య సి బ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News