Tuesday, January 7, 2025

ఎంఎన్ఆర్ పాఠశాలలో ముగిసిన బాలల దినోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ: నవంబర్ 1 నుండి 30 వరకు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా, ఎమ్.ఎన్.ఆర్. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల దంత వైద్య విభాగం, ఎమ్. ఎన్. ఆర్. డెంటల్ కళాశాల,ఎమ్. ఎన్. ఆర్. స్కూల్లో ప్రిన్సిపాల్ పి. నాగ జ్యోతి ఆధ్వర్యంలో నోటి శుభ్రతయే సంపూర్ణ ఆరోగ్యానికి భద్రత అనే అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లలిత కుమారి, డిడబ్ల్యుఒ బాలల వేధింపులు నిర్మూలన, బాలల హక్కుల రక్షణ, మహిళా విద్యాభివృద్ధి అనే అంశాల పై ప్రసంగించారు. అనంతరంఎమ్. ఎన్. ఆర్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. రవీంద్ర నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ వేడుకలలో భాగంగా సంగారెడ్డిలోని ఏడు ప్రైవేట్, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో దంత పరీక్షలు నిర్వహించారు. సుమారు 4345 విద్యార్థులకు దంత పరీక్షలు, దంత పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి పోటీలు – క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలు నిర్వహిం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించి ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించినందుకు పిల్లల దంత వైద్య విభాగం వారిని ప్రశంసించారు.దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 500 మంది విద్యార్థులకు బ్రష్ పంపిణీ నిర్వహించబడింది.ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులకు పిల్లల దంత ఆరోగ్యానికి కావలసిన జాగ్రత్తలు, దంతాలను శుభ్రపరచుకోవాడానికి సరైన పద్ధతిని, పిల్లల దంత చికిత్సలపై అవగాహన కల్పించారు. పిల్లలు దంతక్షయం బారిన పడకుండా 300 పిల్లలకు వారి దంతాలకు ఫ్లోరైడ్ ప్రయోగ కార్యక్రమం నిర్వహించారు.

పాల పళ్ళు యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ దంత వైద్య విద్యార్థులు అవగాహన ర్యాలీ, కరపత్రాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో నుక్కడ్ నాటక్ , క్విజ్ పోటీలు నిర్వహించబడగా ఇందులో బీడీఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్, డా, షేక్. నసీమూన్, డా.స్రవంతి, డా. స్నేహిక, దంత వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News