Friday, December 20, 2024

చర్చ జరగాలి.. యువత గెలవాలి

- Advertisement -
- Advertisement -

ఇవాళ చట్టసభల్లోకి ఎటువంటి వాళ్ళు
వస్తున్నారో మనం చూస్తున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా
ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించినప్పుడు
చట్టసభలకు పోటీ చేసే హక్కును 25 నుంచి 21కి తగ్గిస్తే
తప్పేమిటి? ముఖ్యమంత్రి మాక్ అసెంబ్లీలో పాల్గొంటూ
మాట్లాడిన మాటలు నిజంగా ఆసక్తికరమైనవి. ఈ సమాజం మొత్తం తప్పనిసరిగా దాని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గించినట్టయితే ఎక్కువ సంఖ్యలో యువత రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందన్నది రేవంత్ అభిప్రాయం. ఇది మంచి సూ చన. దీనిమీద దేశమంతటా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.

విద్యార్థులు, యువకులు రాజకీయాల్లో పాల్గొనడానికి ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నది ప్రశ్న. మన దేశంలో చట్టసభల వ్యవహార శైలి చూస్తే దీన్నుంచి ఏం నేర్చుకోవాలి అని ఎవరికయినా అనిపించే రీతిలో వాటి నిర్వాకం తయారయిన విషయం ముఖ్యమంత్రికి తెలియంది కాదు కదా. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడం మంచిదే, కానీ ప్రస్తుతం
రాజకీయాలు చేస్తున్న వాళ్ళంతా ఆ యువతకు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది. రాజకీయ నాయకులు అందరూ దాన్ని ఆచరిస్తే భవిష్యత్తులో యువత నుండి మంచి రాజకీయాలు ఆశించే అవకాశం ఉంటుంది.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బుల్డోజర్ తో తొక్కిస్తా అనడం ఏంటి, అట్లా మాట్లాడవచ్చా? అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి పార్టీకి చెందిన ఒక పెద్దాయన ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో తొక్కిస్తానని మాత్రమే చెప్పారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దమనిషి నిజంగానే బుల్డోజర్లు నడిపించారు. ఆయన బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది నిన్ననే. తన 95 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక వ్యాఖ్యలు చేసింది.

చాచా నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14న ఈ దేశం ఇం కా బాలల దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నది. ఇం కా అని ఎందుకు అనవలసి వస్తున్నదంటే జవహర్లాల్ నెహ్రూ అనే ఒక నాయకుడు ఈ దేశం కోసం ఎంతో పనిచేశాడని, ఈ దేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తం చేయడానికి జరిగిన పోరాటంలో తన జీవితంలో అధిక భాగం వెచ్చించాడని ప్రస్తుత తరాల ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం చా లా పెద్ద ప్రయత్నమే జరుగుతున్నది. జవహర్లాల్ నెహ్రూను ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా అంటారు. ఆధునిక భారత రూపశిల్పి. ఇది ప్రస్తుతం ఈ దేశంలో అధికారంలో ఉన్నవారికి రుచించని విషయం. అందుకే 1964 అనంతరం ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన తప్పులన్నిటినీ నెహ్రూకు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెహ్రూ విధానాలను విమర్శిస్తున్న, ఆయన ప్రతిష్ఠను మసకబార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న ఆ రాజకీయ పార్టీ స్వతంత్ర పోరాటం నాటికి అస్తిత్వంలోనే లేదు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తరువాత పుట్టిన పార్టీ అది.

నెహ్రూ మంచిని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవడమంటే కాంగ్రెస్ కు రాజకీయంగా లాభం చేసినట్టుగా భావిస్తుంది ఆ వర్గం. రాజకీయంగా కాం గ్రెస్ పార్టీలో ఉన్నంతమాత్రాన నెహ్రూ కేవలం ఆ పార్టీకి చెం దినవాడే అనుకుంటారు. ఆయన కేవలం రాజకీయ నాయకు డు కాదు, ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు. సరే, ఆ విషయం ఎలా ఉన్నా మొత్తానికి ఇప్పటివరకయితే చాచా నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవంగా ఇంకా సంబ రం జరుగుతూనే ఉన్నది. కాంగ్రెసేతర పక్షాలు అధికారంలో ఉన్న, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బాలల దినోత్సవం ఎలా జరుగుతోందో తెలియదు గానీ దేశ ప్రజలు మాత్రం నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగానే పరిగణిస్తారు.
నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నవాడు ఆయన. ఈ దేశ భావితరాలకోసం భారత తొలి ప్రధానమంత్రిగా ఆయన వేసిన అభివృద్ధి పునాదులు ఇవాళ్టికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈసారి బాలల దినోత్సవంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలల మాక్ అసెంబ్లీ ఒకదానిలో పాల్గొంటూ నేటి యువకులే రేపటి నాయకులు అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. పూర్వాశ్రమంలో ఆయన పనిచేసిన ఒక రాజకీయపక్షం అయితే అసలు విద్యార్థులకు, యువకులకు రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. విద్యార్థులు బాగా చదువుకోవాలి, యువకులు తమ కెరియర్ మీద దృష్టి పెట్టాలి తప్ప రాజకీయాల వైపు పో కూడదు అనేది అప్పుడు ఆ పార్టీ సిద్ధాంతం. అందరికీ గుర్తుం డే ఉంటుంది. అప్పట్లో ఆ పార్టీ తన రాజకీయ పక్షంలోని వి ద్యార్థి విభాగాన్ని రద్దు చేసుకున్నది కూడా. విద్యార్థులకు రా జకీయాలు ఉండకూడదు, కార్మికులకు సంఘాలు ఉండకూడదు, యువకులు వివిధ వృత్తుల్లో రాణించి డబ్బు సంపాదిం చే మార్గాలు చూసుకోవాలి అని. ఇటువంటి అభిప్రాయాలు రాజకీయ పార్టీలలో ఉండటం శోచనీయం. ఎందుకంటే ఈ దేశాన్ని ముందుకు నడిపించేవి రాజకీయాలు. విలువలతో కూడిన రాజకీయాలు మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చెయ్యడానికి చాలా అవసరం. అవి యువతవల్లనే సాధ్యం.

అయితే కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంటున్నది. ఆ కారణంగానే కదా ఇవాళ చట్టసభల్లోకి ఎటువంటి వాళ్ళు వస్తున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించినప్పుడు చట్టసభలకు పోటీ చేసే హక్కును 25 నుంచి 21కి తగ్గిస్తే తప్పేమిటి? ముఖ్యమంత్రి మాక్ అసెంబ్లీలో పాల్గొంటూ మాట్లాడిన మాటలు నిజంగా ఆసక్తికరమైనవి. ఈ సమాజం మొత్తం తప్పనిసరిగా దాని గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గించినట్టయితే ఎక్కువ సంఖ్యలో యువత రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందన్నది రేవంత్ రెడ్డి అభిప్రాయం. ఇది మంచి సూచన. దీనిమీద దేశమంతటా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకు అవసరమైన చట్ట సవరణలు తీసుకురావడానికి పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది.

ఈ అంశాన్ని పార్లమెంట్ లో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి తెలంగాణ పార్లమెంట్ సభ్యులకు సూచన కూడా చేశారు. ఈ ప్రతిపాదనపట్ల ఎవరికీ అభ్యంతరం ఉం డాల్సిన అవసరం లేదు. కాలంచెల్లిన సిద్ధాంతాలు, విలువలు, అభిప్రాయాలను పట్టుకొని వేలాడవలసిన అవసరం ఎప్పుడూ లేదు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అనేది తప్పనిసరిగా ఏ దేశ ప్రజాస్వామ్య పరిపుష్టానికైనా ఎంతో అవసరమైన విషయం. ఇటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు. పిల్లలు నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని కూడా ఆయన సూచించారు. బాగుంది, ఇదే సభలో ఆ యన మరికొన్ని మాటలు కూడా మాట్లాడారు. పిల్లలను వ్యసనాలకు దూరంగా ఉండమన్నారు. ఇవాళ మనం ఈ దేశంలో యువత ఏ దారిన పోతున్నదో స్పష్టంగా చూస్తున్నాం. విలువలు లుప్తమై, విచ్చలవిడితనం పెరిగిపోయి, సులభమైన ఆదాయ మార్గాలు ఏర్పడిన తర్వాత వస్తున్న కొత్తతరాల వాళ్ళకు ఎటువంటి విలువలను నేర్పగలుగుతున్నామో, వాళ్లు ఏ దారిలో నడుస్తున్నారో అందరం చూస్తూనే ఉన్నాం.

ఇక్కడ ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని హర్షిస్తూనే ఇంకో విషయం మాట్లాడుకోవాలి. యువత రాజకీయాల్లోకి వస్తే యువతకు ఏం అవసరమనే విషయం చట్టసభల్లో చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు ఆయన. అదే సమయంలో బాలలను ఉద్దేశించి.. మీలో కొందరయినా రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని చెప్పారు. చట్టసభల నిర్వహణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా విద్యార్ధులు, యువకులు రాజకీయాల్లో పాల్గొనడానికి ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నది ప్రశ్న. మన దేశంలో చట్టసభల వ్యవహార శైలి చూస్తే దీన్నుంచి ఏం నేర్చుకోవాలి అని ఎవరికయినా అనిపించే రీతిలో వాటి నిర్వాకం తయారయిన విషయం ముఖ్యమంత్రికి తెలియంది కాదు కదా.

యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడం మంచిదే, కానీ ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్న వాళ్ళంతా ఆ యువతకు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం గురింఛి మాట్లాడాల్సిన సందర్భం ఇది. రాజకీయ నాయకులు అందరూ దాన్ని ఆచరిస్తే భవిష్యత్తులో యువత నుండి మంచి రాజకీయాలు ఆశించే అవకాశం ఉంటుంది.
************
అక్కడి ‘బుల్డోజర్’ కనిపించదా?
ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రక్షాళన రాజకీయ పక్షాల ప్రధాన ఎజెండాగా మారి కూర్చున్నది. ప్రక్షాళన జరిగి మూ సీ పవిత్రం అయ్యేది ఎప్పుడో గాని రాజకీయ ప్రకటనల మురి కి మాత్రం తెలంగాణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

మూసీ ఒడ్డున విడిది చేస్తామని ఒకరంటే, మూసీ దగ్గర నిద్రకు ఉపక్రమించిన వాళ్లు మరికొందరు. తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకులంతా మూసీ ఒడ్డున నిద్రించడానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ ప్రయాణించిన మార్గంలో కాసేపు పాదయాత్ర జరిపారు. అక్కడే ఆయన మా ట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డు వస్తే బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తానన్నారు. అన్నంతమాత్రాన ఆయన ఏమీ ప్రతిపక్షాన్ని బుల్డోజర్లు పెట్టి తొక్కించి చంపుతారని కాదు గాని రాజకీయాల్లో ఇట్లాంటి పరుష పదాలు శోభనివ్వవు. ఒక మంచి పని తలపెడితే ఎవరైనా అనవసరమైన అడ్డంకులు సృష్టించినప్పుడు తప్పనిసరిగా ఆగ్రహం కలుగుతుంది. ఆవేశంవల్ల మా టలు తూలే అవకాశం కూడా ఉంటుంది. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రి నోట అటువంటి మాట వెలువడటంతో సహజంగానే ఆయన మీద ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

ముఖ్యమంత్రిని విమర్శించిన వాళ్ళలో కేంద్రమంత్రి గంగపురపు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బుల్డోజర్ తో తొక్కిస్తా అనడం ఏంటి, అట్లా మాట్లాడవచ్చా? అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి పార్టీకి చెందిన ఒక పెద్దాయన ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో తొక్కిస్తానని మాత్రమే చెప్పారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దమనిషి నిజంగానే బుల్డోజర్లు నడిపించారు. ఆయన బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది నిన్ననే.

ఇందులో విచిత్రం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడుగానో దోషిగానో ఉన్నాడన్న కారణం చేత ఆ వ్యక్తి యొక్క నివాస లేదా వాణిజ్య భవనాలను కూల్చివేయడం జరుగుతున్నదట ఉత్తరప్రదేశ్ లో. అధికారులు న్యాయమూర్తుల్లా ఎట్లా వ్యవహరిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. కార్యనిర్వాహక అధికారులకు అటువంటి అధికారాలు ఉండవు అని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. అంతేకాదు ఆస్తుల కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. తన 95 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక వ్యాఖ్యలు చేసింది.

ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఒక ముఖ్యమైనది, ఆసక్తికరమైనది ఏమిటంటే.. ఒక ఇంట్లో ఒక నిందితుడు ఉంటే ఆ ఇంటిని కూల్చడంవల్ల మిగతావారిని ఎలా నిరాశ్రయుల్ని చేస్తారు అనేది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటువంటి వ్యాఖ్య చేసింది అంటే అటువంటి సంఘటనలు న్యాయస్థానం దృష్టికి వచ్చి ఉంటేనే కదా.

తమ ఏలుబడిలో ఉన్న రాజ్యాల్లో ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిగారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆవేశంలో అన్న ఒక మాటను పట్టుకొని ఆక్షేపించడం ఎంత వరకు సమంజసం?

– దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News