- Advertisement -
పారిస్ : ఫ్రాన్స్‌లోని అనెసీ పట్టణం లోని ఓ పార్కులో ఆగంతకుడు కత్తి దాడులతో చెలరేగిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారులను కూడా విడిచిపెట్టలేదు. ఈ సంఘటనలో నలుగురు పిల్లలు, ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
దాడికి పాల్పడిన నిందితుడిని పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మనిన్ చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ సంఘటనకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని ఎలిజబెత్ బార్న్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్‌లు వెల్లడించారు. దాడుల వెనుక కారణాలను ఆరా తీస్తున్నారు.
- Advertisement -