Wednesday, January 22, 2025

ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తమ్ముడు మోసం చేశాడంటూ ఇద్దరు పిల్లలతో సహా తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దిపేట ఎసిపి మధు, టూటౌన్ సిఐ ఉపేందర్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం నెహ్రూ పార్క్ కాలనీకి చెందిన నివాసి తేలు సత్యం (48) స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యలు రావడంతో పాటు, గుండె చికిత్స జరగడంతో తొమ్మిది లక్షల వరకు అప్పు అయింది.

దీంతో తమ్ముడు శ్రీనివాస్‌ను తనకు ఇవ్వాల్సిన 5 లక్షల 50 వేల రూపాయలు అడగడానికి అతని ఇంటికి వెళ్లగా, బూతు మాటలు తిట్టి చెప్పుతో కొట్టి ఇంటి నుండి వెళ్లగొట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానకి గురైన సత్యం శనివారం రాత్రి తన భార్య శిరీషకు చెప్పకుండా కొడుకు తేలు అద్వేష్ నంద (8), తేలు త్రివర్ణ హాసిని (6)ని తీసుకొని చింతల చెరువుకు చేరుకున్నాడు. అక్కడ సెల్ఫీ వీడియో తీసుకుని.. తన చావుకు తన తమ్ముడు శ్రీనివాస్ కారణం అని, పిల్లల్ని చెరువులోకి తోసి తాను కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News