Sunday, December 22, 2024

కూచిపూడి నాట్యంలో చిన్నారి ప్రతిభ

- Advertisement -
- Advertisement -

నర్సంపేట:పట్టణంలోని ద్వారకపేటకు చెందిన రామ సాయం నితిన్‌రెడ్డి చందనల కూతురు ఆద్యారెడ్డి కూచిపూడి నాట్యం చేసి పతిభ కనబర్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమాల్లో పట్టణంలోని అక్షర పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఆద్యారెడ్డి శ్రీనట వేద కళా క్షేత్రం పరంజ్యోతి గురువు నేతృత్వంలో నాట్యం నేర్చుకొని హైదరాబాద్‌లో నిర్వహించిన కూచిపుడి నాట్యంలో ప్రతిభ కనబర్చారు.నిర్వాహకులు మెమోంటోతో ఘనంగా సత్కరించారు. కూచిపుడి నాట్యంలో సాధన చేసి చిన్నప్పటి నుంచే ప్రతిభ చూపిస్తున్న చిన్నారిని 6వ వార్డు కౌన్సిలర్ రామస్వామి శ్రీదేవి సుధాకర్‌రెడ్డిలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News