Friday, December 20, 2024

చిలీలో 112 కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

శాంటియాగో : గత మూడు రోజులుగా చిలీలో చెలరేగుతున్న కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు 112 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు బూడిదయ్యాయి. దాదాపు 1600 మంది నిరాశ్రయులయ్యారు. 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలి బూడిదైంది. మంటల తీవ్రత అధికంగా ఉన్న వియా డెల్‌మార్ పట్టణంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ పట్టణంలో దాదాపు 200 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. దగ్ధమైన ఇళ్లలో సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చేపడుతున్నారని చెప్పారు. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోందని, ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా ఉందని వియా డెల్ మార్ పట్టణం ఉన్న వల్ఫరైజో రీజియన్ గవర్నర్ రోడ్రిగో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News