Sunday, January 19, 2025

హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ మృతి

- Advertisement -
- Advertisement -

శాంటిగో: హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మృతి చెందారు. శాంటిగో దక్షిణాన 920 కిలో మీటర్ల దూరం గల లాగో రాంకో ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. సెబాస్టియన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. 2010 నుంచి 2014, 2018 నుంచి 2022 వరకు ఆయన చిలీ అధ్యక్షుడిగా సేవలందించారు. పినెరా మృతిపట్ల ఆ దేశపు అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్, లాటిన్ అమెరికా నేతలు సంతాపం తెలిపారు. సెబాస్టియన్ చనిపోవడంతో ఆ దేశంలో విషాదచాయలు అలుముకున్నాయి. కూలిపోయిన హెలికాప్టర్ లో ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 2014లో ‘ది33’ అనే చిత్రాన్ని తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News