Sunday, April 13, 2025

మిర్చి రైతు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మిర్చి రైతు ఆత్మహత్యాకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మావరం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ధర్మవరం గ్రామానికి చెందిన బొగట నరసింహారావు రెండెకరాలలో మిర్చి పంటను సాగు చేశాడు. కగా అదే గ్రామానికి చెందిన బొల్లె ప్రశాంత్ అనే మందుల షాపు యాజమాని వద్ద మిర్చి తోటకు కావల్సిన పురుగుల మందులను అప్పుగా తెచ్చి తన మిర్చి తోటకు వాడుకున్నాడు. పండించిన మిర్చి పంటను బస్తాల్లో నింపుతుండగా మందుల షాపు యాజమాని అక్కడికి చేరుకుని తొంబై వేలరూపాయల వరకు బాకీ ఉందని తన అప్పు తీర్చాలని రైతును అడగడంతో పాటు కల్లంలో తొక్కిన

మిర్చి బస్తాలను ట్రాక్టర్ ద్వారా తరలించేందుకు ప్రయత్నించాడు. మిర్చి బస్తాలను లాక్కెళ్తున్న మందుల షాపు యాజమానికి అడ్డుపడి గత మూడేళ్ళుగా నష్టాలు వస్తున్నాయని బాకీ కింద 15 బస్తాలు ఇస్తానని మిగతా బాకీ వచ్చే ఏడాది చెల్లిస్తానని మందుల షాపు యాజమానిని రైతు ఎంత బ్రతిమాలిన వినకుండా మిర్చి బస్తాలను తీసుకెళ్ళడంతో తీవ్ర మనస్తాపనికి గురైన రైతు ఇంట్లోకి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు రైతు నరసింహారావును ఏటూనాగారం వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతధికారుల దృష్టికి వెళ్ళినట్లు విచారణ చేపట్టాలని అదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News