- Advertisement -
రాష్ట్రంలో మిర్చిబోర్డు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వ తేదీన ఖమ్మంలో మిర్చి రైతుల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం నాయకుడు బొంతు రాంబాబు తెలిపారు. దేశంలో అత్యధికంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మిర్చి సాగు అవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా క్వింటాల్ మిర్చి ధరను రూ.25వేలుగా ప్రకటించాలని ఆయన కోరారు.
- Advertisement -