Thursday, January 23, 2025

చైనా స్వంతంగా నిర్మించిన ప్రయాణికుల విమానం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా స్వంతంగా నిర్మించిన సి919 అనే ప్రయాణికుల విమానం వాణిజ్య పరంగా తొలిసారి గగనంలో విహరించింది. ఆదివారం మొదటి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నిర్వహించే ఈ విమానంలో 164 సీట్లు ఉన్నాయి. తొలిసారి 130 మంది ప్రయాణించారు. ఆదివారం ఉదయం 10.32 గంటలకు షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి, మధ్యాహ్నం 12.31 గంటలకు బీజింగ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

ఈ సందర్భంగా ప్రయాణికులకు విమాన సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వారికి విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేశారు. చైనా దేశీయంగా అభివృద్ది చేసిన ఈ విమానం సోమవారం నుంచి రెగ్యులర్‌గా సేవలు అందిస్తుంది. షాంఘై నుంచి చెంగ్టుకు ప్రయాణించనున్నది. చైనా స్వంతంగా తయారు చేసిన ఈ విమానం పశ్చిమ దేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News