Monday, December 23, 2024

తైవాన్ దాపున 38చైనా విమానాలు

- Advertisement -
- Advertisement -

తైపీ : తైవాన్ సమీపంలోకి చైనా 38 యుద్ధ విమానాలను , 6 యుద్ధ నౌకలను చేర్చింది. చైనా సైనిక వర్గాలు తైవాన్‌ను దిగ్బంధిస్తూ వస్తున్న క్రమంలో ఇంతకు ముందెన్నడూ లేనిస్థాయిలో ఇప్పుడు చైనా బలప్రదర్శనకు దిగినట్లు స్పష్టంఅయింది. 38 వరకూ శక్తివంతమైన ఫైటర్ జెట్స్, ఇతర యుద్ధ విమానాలు సిద్ధం చేసి ఉంచారు.

సముద్ర జలాలలో నౌకలు సంచరిస్తున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన పి 8ఎ పొసియిడన్ యాంటి సబ్‌మెరైన్ సహిత తనిఖీల విమానం తైవాన్ సింధుశాఖ మీదుగా సంచరించడం పట్ల చైనా నిరసన వ్యక్తం చేసింది. అమెరికా ఈ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు దిగుతోందని చైనా సైనిక అధికార వర్గాలు మండిపడ్డాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి భారీ స్థాయిలో చైనా సైనిక పాటవ ప్రదర్శనకు రంగం సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News