Wednesday, April 2, 2025

తూర్పు లడఖ్‌లో పరస్పర ఆమోద తీర్మానానికి చైనా అంగీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో సమస్యలకు సంబంధించి పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని భారత్, చైనా అంగీకరించాయి. ఆదివారం జరిగిన సైనిక చర్చల అనంతరం ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించాయి. పశ్చిమ సెక్టార్‌లోని రేఖ (ఎల్‌ఎసి) వెంబడి నెలకొన్న సమస్యల పరిష్కారంపై ఇరుపక్షాలు స్పష్టమైన చర్చలు జరిపాయి. ఈ విషయాన్ని వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఎ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మిలటరీ, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించడానికి, సమస్యలపై పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి అంగీకరించినట్లు ఎంఇఎ తెలిపింది.

శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు ప్రకటనలో పేర్కొంది. కాగా కేంద్రం తూర్పు లడఖ్‌ను పశ్చిమ సెక్టార్‌గా పేర్కొంది. భారత్, చైనా సైనిక కమాండర్ స్థాయి రౌండు చర్చలు ఆదివారం చైనా వైపు ఉన్న చుషుల్‌మోల్డో సరిహద్దులో జరిగాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌సిఒ) సమావేశంలో పాల్గొనేందుకు చైనా రక్షణమంత్రి షాంగ్‌పు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సైనిక చర్చలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News