Monday, December 23, 2024

పాకిస్థాన్‌కు చైనా రుణ రీషెడ్యూల్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ పట్ల మరో మారు ఔదార్యం చాటుకుంది.రెండు బిలియన్ డాలర్ల మేర ఉన్న పాకిస్థాన్ రుణ చెల్లింపులను రీషెడ్యూల్ చేసేందుకు అంగీకరించింది. రెండేళ్ల పాటు ఈ రుణాలను చెల్లించే అవసరం లేదని తెలిపింది. ఆర్థిక సంక్షోభపు పాకిస్థాన్ నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అప్పులు తీసుకుని అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పునరుద్ధరించుకొంటోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చైనా రుణ రీషెడ్యూల్ జరిగింది. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన సంబంధిత ఒప్పందానికి పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ సారథ్యపు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (ఇసిసి) ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News