Thursday, January 23, 2025

చైనా విమానం బ్లాక్‌బాక్స్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

China aircraft blackbox recognition

 

బీజింగ్ : చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం కొండల్లో కూలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానం ధ్వని వేగంతో ప్రయాణించి కొండ ప్రాంతాన్ని ఢీకొన్నట్టు ఫ్లైట్ ట్రాక్ డేటా విశ్లేషణ ద్వారా గుర్తించారు. కూలిన విమానం లోని రెండు బ్లాక్ బాక్స్‌ల్లో ఒక దాన్ని బుధవారం గుర్తించగలిగారు. చైనా విమానయాన సంస్థ అథికార ప్రతినిధి లియు లుసాంగ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆ బ్లాక్‌బాక్స్ బాగా ధ్వంసమైనట్టు ఆ దేశ అదికార మీడియా పేర్కొంది. కూలిన విమానంలో రెండు ఫ్లైట్ రికార్డులున్నాయి. కాక్‌పిట్‌లో ఒక వాయిస్ రికార్డర్ ఉండగా, ప్రయాణికుల క్యాబిన్ చివరివైపున మరో వాయిస్ రికార్డర్‌తోపాటు ఫ్లైట్ డేటా ట్రాకర్ ఉన్నది. అయితే గుర్తించిన బ్లాక్ బాక్స్ క్రూ క్యాబిన్ లోనిదా లేక విమానం చివరి వైపు ఉన్నదా అన్నది తెలియలేదు.

మరో వైపు ఆ విమానం 29 వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు కూలిపోయింది. విమానం కూలిన సమయంలో అది సుమారు ధ్వని వేగంతో గంటకు 595 మీటర్ల మేర నిటారుగా ప్రయాణించినట్టు ఫ్లైట్ రాడర్ 24 డేటా ద్వారా అంచనా వేశారు. ప్రస్తుతం దర్యాప్తు బృందం పద్ధతుల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. విమానం నిర్వహణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వాతావరణం, విమానం డిజైన్, తయారీ, తదితర అంశాలను కూడా పరిగణన లోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News