- Advertisement -
బీజింగ్: అర సంవత్సరం తర్వాత కొవిడ్-19తో ఒకరు చనిపోయారని చైనా ఆదివారం ప్రకటించింది. కొత్తగా మళ్లీ పెల్లుబుకుతున్న కొవిడ్ వ్యాధి కారణంగా చైనా అంతటా ఆంక్షలు విధించారు. మే 26 తర్వాత మళ్లీ ఇప్పుడు బీజింగ్‌లో 87 ఏళ్ల వ్యక్తి కొవిడ్19తో చనిపోయాడని చైనా పేర్కొంది. దీంతో కొవిడ్ మరణాల సంఖ్య చైనాలో 5227కు చేరింది. చైనాలో 92 శాతం కంటే ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. బీజింగ్ నగరంలోని వాసులు జిల్లాలకు ప్రయాణించొద్దని ఆంక్ష విధించారు. రెస్టారెంట్లు, షాపులు, మాల్స్, కార్యాలయ భవనాలు, అపార్ట్‌మెంట్లు, వేరుగా ఉన్న వాసాలలోకి పెద్ద సంఖ్యలో జనులు పోవద్దని కూడా నియమాలు విధించారు. 24215 కొత్త కేసులు వెలుగు చూసినట్లు చైనా ఆదివారం వెల్లడించింది. వాటిలో చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయని(ఎసింప్టోమేటిక్) పేర్కొంది.
- Advertisement -