Tuesday, March 18, 2025

భారత్ చైనా సంబంధాలపై మోదీ వ్యాఖ్యలు ప్రశంసనీయం: చైనా

- Advertisement -
- Advertisement -

చైనా – భారత్ సంబంధాలు, పరస్పరం చర్చల విషయంలో భారత ప్రధాని మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మాన్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో మోదీ పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ, గత అక్టోబర్ లో రష్యాలోని కజాన్ లో చైనా ప్రెసిడెంట్ జీ జిన్ నింగ్ తో జరిగిన సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడ్డాయని, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించిందని మోదీ వివరించారు. మోదీ ఉభయదేశాల సంబంధాలపై సానుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాల పై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు. ఉభయ దేశాలు ముఖ్యమైన అంశాలపై అవగాహనతో సానుకూల ఫలితాలు సాధించాయని మావో నింగ్ పేర్కొన్నారు.

ఉభయ దేశాల మధ్య 2000 సంవత్సరాలుగా చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను ఇక ముందు కూడా కొనసాగిస్తాయని మావో నింగ్ స్పష్టం చేశారు.భారత చైనాలకు చెందిన 280 కోట్ల ప్రజల ప్రయోజనాలకు సన్నిహిత సంబంధాలు దోహదపడతాయని, ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడం కీలకం కాగలవన్నారు. ప్రపంచ శాంతికి అనుకూలమైన పరిస్థితికి తోడ్పడగలవని ఆమె అన్నారు. రెండు దేశాలు ఒకరి విజయానికి మరొకరు దోహదపడే భాగస్వాములుగా ఉండాలని మావో నింగ్ ఆకాంక్షించారు.2020లో తూర్పు లద్దాక్ లో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఇటీవల జరిగిన చర్చల కారణంగా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయని మోదీ అన్నారు.ఉభయ నాయకుల మధ్య చక్కటి అవగాహన అమలుకు చైనా 75వ వార్షికోత్సవం చక్కటి అవకాశం కాగలదని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News