Monday, December 23, 2024

రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్..31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలోని ఒక రెస్టారెంట్ గ్యాస్ లీకై పేలుడుకు అగ్ని ప్రమాదం సంభవించడంతో 31 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చైనా ప్రజలు ప్రస్తుతం డ్రాగన్ బోట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. మూడు రోజులు సెలవులు కావడంతో బంధుమిత్రులతో సరదాగా గడుపుతున్నారు. పండగ కోసం అంతా గుమిగూడి ఉన్న సమయంలో యించువాన్ నగరం లోని ఫ్యూయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పది వరకు ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పగలిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News