Monday, December 23, 2024

భూమి పొరల లోగుట్టుకోసం చైనా పట్టు.. 32,808 అడుగుల లోతు బిలం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : మానవాళి ఉనికిని నిలిపే భూమి ఉపరితలం, అంతర్భాగ పొరలలోని విశేష రహస్యాలను ఛేదించేందుకు చైనా ఇప్పుడు భూలోక సొరంగ పనులలో పడింది. భూమి పొరల లోతులలో తవ్వకాలు (డ్రిల్లింగ్) చేపట్టింది. భూమిని చీలుస్తూ వెళ్లే ఈ రంధ్రం 10,000 మీటర్లు అంటే దాదాపు 32,808 అడుగుల వరకూ ఉంటుంది. చైనాలోని చమురు నిక్షిప్త సంపన్నతల జిన్‌జియాంగ్ ప్రాంతంలో భారీ ఎత్తున ఈ పనులు చేపట్టారు.

అయితే నిర్ణీత లక్షం మేరకు ఈ రంధ్రాన్నితొలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది నిర్థారణ కాలేదు. భూమి స్వరూపం దీని విశేషాలు, పనిలో పనిగా అంతర్గత ఇప్పటివరకూ వెలికిలోకి రాని వనరులపై అన్వేషణలు జరిపితీరాలని ఇటీవలే చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ శాస్త్రజ్ఞులను కోరారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనితో ఇప్పుడు ఈ పని ఆరంభం అయిందని అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. చైనా రూపొందించే బిలం దాదాపు పది ఖండాలను అంతర్గతంగా పొరల్లో చీల్చుకుంటూ వెళ్లుతుంది. ప్రత్యేకించి భూ ఆవిర్భావానికి అత్యంత కీలకమైన క్రేటేసియస్ పొరను తాకుతుంది.

ఇక్కడ 145 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాళ్లు ఉన్నాయి. వీటిని కనుగొనగల్గితే భూ అంతర్భాగం, భూమి పుట్టుక వివరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుంది. ఇదే దశలో ఈ మధ్యలో ఉండే వనరులను పసికట్టేందుకు వీలేర్పడుతుంది. భూమిపొరల రహస్యాన్ని ఛేదించేందుకు ఇప్పటికే రష్యా 1989లోనే 12,262 మీటర్లు అంటే దాదాపు 40,230 మీటర్ల లోతైన బిలాన్ని 20 ఏళ్ల పాటు శ్రమించి తవ్వింది. దీనిని కోలా సూపర్‌డీప్ బోర్‌హోల్‌గా పిలుస్తున్నారు. అయితే దీని ద్వారా ఎటువంటి ఆవిష్కరణలు వెలువడ్డాయనేది తెలియలేదు.

అటు భూమిలోకి ఇటు నింగిలోకి
చైనా పరీక్షల సందడి
ఇప్పుడు భూమి అంతర్భాగాల అన్వేషణకు అడుగేసిన చైనా ఒక్కరోజు క్రితం అంతరిక్షం వైపు తన ప్రయోగాలను విస్తృత పర్చింది. గోబీ ఎడారుల నుంచి చైనా తొలిసారిగా తమ దేశ పౌరుడిని తొలిసారిగా అక్కడి స్పేస్‌టౌన్ నుంచి వ్యోమగామిగా పంపించింది. ఇదో కీలక విషయం అని చైనా అంతరిక్ష విభాగం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News