40కి పైగా విమానాలు సున్నిత మీడియన్ లైన్ దాటాయి !!
తైవాన్ జలసంధిలో మూడు రోజుల సైనిక విన్యాసాలు ప్రారంభిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌తో తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్‌వెన్ సమావేశం కావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ , తైవాన్ జలసందిలో మూడు రోజుల పాటు సైనిక విన్యాసాలు ప్రారంభిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ‘యుద్ధ సన్నద్ధత’ కోసం ఏప్రిల్ 8 నుంచి 10 వరకు ‘యునైటెడ్ షార్ప్ స్వార్డ్’ నిర్వహించబోతున్నట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తెలిపింది. లాస్ ఏంజిల్స్‌లో స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో జరిగిన సమావేశాన్ని చైనా ఖండించిన తర్వాత ఈ సైనిక కసరత్తు ఊహించిందేనని అంటున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడుతున్న తైవాన్‌ను చైనా తన స్వంత భూభాగంగా చూపుతోంది, ఆ ద్వీపాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోడానికి బలప్రయోగానికి కూడా ఎన్నడూ వెనుకాడలేదు. అయితే చైనా వాదనలను తైవాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది.