Saturday, November 9, 2024

మణిపూర్ ఘర్షణల వెనుక చైనా పాత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ ఘర్షణలు, విధ్వంసకాండ వెనుక విదేశీ పాత్ర , ప్రత్యేకించి చైనా సాయం ఉండటానికి వీలుందని భారత సైనిక మాజీ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరావానే తెలిపారు. మణిపూర్‌లో ఇప్పుడు కనివినిఎరుగని రీతిలో సాగుతోన్న హింసాకాండ అసాధారణంగా ఉందని ఈ సైనికాధికారి అభిప్రాయపడ్డారు. హింసకు చైనా నుంచి నేరుగా సాయం ఉండకపోవచ్చు కానీ అక్కడి వివిధ తిరుగుబాటు బృందాలకు పలు స్థాయిల్లో చైనా సాయం ఉండి ఉంటుందని ఆయన చైనా పాత్ర గురించి సంకేతాలు వెలువరించారు.

స్థానిక ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శనివారం జాతీయ భద్రతా అంశాలపై జరిగిన చర్చాగోష్టిలో నరావానే మాట్లాడారు. కేవలం పొరుగుదేశంలోనే కాకుండా, మన సరిహద్దుల్లోని రాష్ట్రంలో అయినా అంతర్గత భద్రత కీలకం అని, దీనిపై రాజీ పడటానికి వీల్లేదని తెలిపారు. ఎక్కడ ఎటువంటి అభద్రత ఉన్నా అది ఖచ్చితంగా దేశ మొత్తం మీది జాతీయ భద్రతకు విఘాతం అవుతుందన్నారు. కల్లోలిత మణిపూర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం తగు విధంగా చర్యలు తీసుకుంటుందనే తాము ఆశిస్తున్నట్లు విశ్రాంత సైనికాధికారి తలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News