భారీ కాంక్రీటు నిర్మాణాలు, రోడ్లు
లద్థాఖ్: సరిహద్దులలో చైనా కవ్వింపులు సాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి చైనా సైనిక బలగాల బస కోసం శాశ్వత నిర్మాణాలు కాంక్రీటు పద్ధతిలో చేపట్టారని నిఘా వర్గాలు పసికట్టాయి. ఇటువంటి నిర్మాణాలతో పాటు రహదారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసింది. దీనితో చైనా పేరుకే ఇక్కడ కాల్పుల విరమణకు దిగిందని, అయితే ఈ తెరవెనుక పూర్తిస్థాయిలో తన బలగాల పటిష్టతకు, అతి వేగంగా సైన్యం కదలికలకు అన్ని సన్నాహాలు చేసుకొంటోందని, కవ్వింపు చర్యలు తప్ప చైనా దూకుడు మారలేదని స్పష్టం చేసింది. భారతదేశంతో ఉన్న వివాదాస్పద ప్రాంతాలకు నేరుగా తొందరగా చేరుకునేందుకు సిద్ధం అయినట్లు స్పష్టం అయింది. అన్నింటికి మించి చైనా ఆర్మీ సిక్కిం, లద్థాఖ్‌ల చెంతన మకాం వేసుకుందని , రోజురోజుకీ బలోపేతం అవుతోందనే నిఘా సంస్థల సమాచారం భద్రతా బలగాలకు ఆందోళన కల్గించింది.
China building concrete camps near Sikkim