Friday, November 15, 2024

అరుణాచల్‌లో చైనా గ్రామం

- Advertisement -
- Advertisement -

China built large village in Arunachal Pradesh, India

వాషింగ్టన్ : భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఏకంగా ఓ పెద్ద గ్రామాన్ని నిర్మించుకుంది. అమెరికా భద్రతా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం పెంటగాన్ ఈ మేరకు తన తాజా నివేదికను అమెరికా చట్టసభలకు అందించింది. భారత్ చైనా సరిహద్దుల వెంబడి ఉన్న వివాదాస్పద హక్కుల ప్రాంతంలో చైనా ఈ గ్రామం ఏర్పాటు వంటి చర్యలతో పూర్తిస్థాయిలో అభ్యంతరకర చర్యలకు దిగిందని ఈ నివేదికలో తెలిపారు. భారతదేశపు అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్‌పై భౌగోళిక హక్కులు తమవే అని చైనా పలు మార్లు వివాదాస్పద వాతావరణం సృష్టించింది. చైనా సైనిక చర్యల అంశాన్ని ప్రస్తావిస్తూ పెంటగాన్ వార్షిక నివేదికను యుఎస్ కాంగ్రెస్‌కు నివేదించింది.

ఇందులో అరుణాచల్‌లో వెలిసిన చైనా గ్రామం ప్రధానంగా ప్రస్తావించారు. చైనా ప్రభు త్వం తమ క్షేత్రస్థాయి సైనిక వర్గాల ద్వారా ఈ గ్రామాన్ని గత ఏడాది టసారి నది వెంబడి నిర్మించింది. ఇది చైనా సైన్యం స్థావరంగా కూడా ఉం దని తెలిపింది. ఓ వైపు గ్రామం ముసుగులో దీనిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంపై హక్కు చాటుకోవడం, మరో వైపు సైనిక స్థావరంగా దీనిని మలుచుకోవడం ద్వారా చైనా తన ద్వంద్వ ప్రయోజనాల నీతిని ప్రదర్శించింది. ఇక్కడ వంద గృహాలు ఉన్నాయి, పౌరులు కూడా వచ్చిచేరారు.

మెక్‌మోహన్ రేఖ వెంబడే కుంపటి

అత్యంత కీలకమైన మెక్‌మోహన్ రేఖ వెంబడి గ్రామం ఏర్పాటుతో పాటు ఈ చుట్టుపక్కల చైనా తన సైనిక మౌలిక ఏర్పాట్లను బలోపేతం చేసుకోవడం వంటి చర్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసే చర్యలకు ప్రతీక అని నివేదికలో తెలిపారు. ఏ విధంగా చూసినా భారత్ చైనాల మధ్య సరిహద్దుల ప్రతిష్టంభన సమసిపోలేదు. చర్చల ప్రక్రియలో పెద్ద పురోగతి లేదని ఈ నివేదికలో తెలిపారు. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) తరచూ గిల్లికజ్జాలకు దిగుతోంది. 2020 మే నుంచి అడపాదడపా ఘర్షణలకు పాల్పడుతోంది. ఈ విధంగా సరిహద్దులలో నిప్పుల కుంపటిని రాజేసిందని, ఈ దశలోనే గల్వాన్ వద్ద చైనా దూకుడుతో 21 మంది భారతీయ జవాన్లు , చైనా వైపున నిర్థారణ కాని సంఖ్యలో సైనికులు మృతి చెందారని పెంటగాన్ తెలిపింది. ఆ దశలో చైనా సైన్యం క్రమం తప్పకుండా భారతీయ ప్రాదేవిక ప్రాంతంలోకి చొచ్చుకుపోవడం, శిబిరాలు ఏర్పా టు చేసుకోవడం, సైనిక బలగాలను ఆయుధ పాటవాన్ని స్థావరాలను బలోపేతం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ప్రత్యేకించి ఎల్‌ఎసి వెంబడి ఉన్న పలు ప్రతిష్టంభన ప్రాంతాలలో చైనా చర్యలు సాగాయని పెంటగాన్ తెలిపింది.పశ్చిమ చైనా లోతట్టు ప్రాంతంలో భారీ స్థాయిలో సైనిక బలగాలను మొహరించుకుని ఉండి, అవసరం అయిన వెంటనే సరిహద్దులకు తరలించేందుకు సిద్ధం అయిందని పసికట్టారు. శిక్షణ, క్షేత్రస్థాయి పరికరాల తరలింపును ముమ్మరం చేశారు .2020లో మారణాయుధాల బలోపేతం. స్వయం చోదక పిసిఎల్ 171 హోవిట్జర్లను సంతరించుకుంది. దూర ప్రాంత సబ్ మెరైన్లు , ఉపరితల ప్రాతిపదిక ఆయుధ పాటవం బలోపేతానికి దిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News