Wednesday, January 22, 2025

చైనా అపరసృష్టి ఆవులు

- Advertisement -
- Advertisement -

చైనా శాస్త్రవేత్తలు విశ్వామిత్రునిలా అపర సృష్టిలో ఆవులను బోలిన ఆవులను సృష్టించారు. ఈ అపరసృష్టిని శాస్త్రీయంగా క్లోనింగ్ అని అంటారు. ఈ ఆవులను సూపర్ ఆవులుగా చైనా వారు పిలుస్తున్నారు. ఇవి తమ జీవిత కాలంలో చాలా ఎక్కువగా పాలిస్తాయి. విదేశీ పాడి పశువుల సంతతిపై ఆధారపడకుండా ఉండేందుకు స్వయంగా ఈ క్లోనింగ్ ప్రక్రియను చేపట్టారు. చైనా గ్లోబల్ టైమ్స్ వివరాల ప్రకారం చైనా డైరీ ఆవుల్లో దాదాపు 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవే.

ఈ సూపర్ ఆవులు అంటే మూడు దూడలు. చైనా నార్త్‌వెస్ట్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు దూడలను క్లోనింగ్ చేసింది. నింగ్‌జియా రీజియన్‌లో ఈ దూడలు జన్మించాయి. ఈ ప్రాజెక్టు ను నిర్వహిస్తున్న శాస్త్రవేత్త జిన్ యాపింగ్ ఈ దూడల క్లోనింగ్ విజయవంతం కావడం గొప్ప మేలి మలుపుగా అభివర్ణించారు. దాదాపు వెయ్యి సూపర్ ఆవుల మందను రెండు మూడేళ్లలో తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నామని చెప్పారు.

విదేశాల ఆవుల సంతతిపై పూర్తిగా ఆధారపడడంతో ఒక్కోసారి అక్కడ నుంచి సరఫరా కాక ఉక్కిరిబిక్కిరి అయ్యేవారమని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లోనింగ్‌కు నడుం కట్టుకున్నామన్నారు. ఇప్పటి మూడు దూడలు డచ్ హోల్‌స్టెయిన్ ఫ్రెస్టియన్ జాతికి చెందినవి. ఈ జాతి ఆవులు అత్యధికంగా పాలను ఇస్తాయి. అమెరికా ఆవులు తమ జీవిత కాలంలో ఇచ్చే పాల దిగుబడి కన్నా 1.7 రెట్లు ఎక్కువగా ఈ జాతి ఆవులు పాలను ఇస్తాయి. ఇప్పుడు క్లోనింగ్ దూడలు తమ జీవిత కాలంలో 100 టన్నుల పాలను ఇస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News