Friday, January 10, 2025

ప్రేమించుకునేందుకు విద్యార్థులకు వారం రోజులపాటు సెలవు!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలోని తొమ్మిది కాలేజీలు ప్రేమను పొందేందుకు విద్యార్థులకు ఏప్రిల్‌లో వారం రోజులపాటు సెలవును ఇచ్చాయి. దేశంలో పడిపోతున్న జనాభాను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటున్నాయి. అక్కడ జననాల రేటు గణనీయంగా పడిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. మార్చి 1 నుంచి 7 వరకు అక్కడి కాలేజ్‌లు ప్రేమించుకునేందుకు సెలవులు ప్రకటించాయి. ‘ప్రకృతిని ప్రేమించడం, జీవితాన్ని ప్రేమించడం, వసంత విరామాన్ని ఆస్వాదించడం ద్వారా ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి’ అంటూ మరీ ప్రోత్సాహిస్తున్నాయి.

చైనాలో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండేది. కానీ 2022 తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే ఆరు దశాబ్దాల కనిష్ఠానికి ఆ దేశ జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు చైనా జననాల రేటును పెంచుకోడానికి చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు ఒక కుటుంబానికి ఒకే సంతానం అన్న నిబంధన విధించిన ఆ దేశం నేడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. దంపతులు మూడో బిడ్డను కంటే రూ. 2 లక్షలను హాంగ్జౌ అనే చైనా నగరం ఇస్తోంది. రెండో బిడ్డను కంటే రూ. 60000 ఇస్తోంది. షెన్‌యాంగ్ అనే మరో చైనా నగరమైతే నెల బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకు నెలకు రూ. 6000 వరకు సబ్సిడీని అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News