Tuesday, January 14, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

టిబెట్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలోచైనా భారీగా సైనిక విన్యాసాలను మొదలు పెట్టింది.న అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత ,లాజిస్టిక్స్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పీఎల్‌ఏ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే ఇంకొన్నాళ్లలో ఉందనగా చైనా వీటిని మొదలు పెట్టడం గమనార్హం. షింజియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ వీటిని చేపట్టింది. అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్ టెర్రైన్ వెహికల్స్, అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్, డ్రోన్లు, ఎక్సో స్కెలిటెన్స్ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వినియోగిస్తున్నారు.

మరోవైపు వీటిని దృష్టిలో ఉంచుకొని భారత దళాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా బీజింగ్ చేపట్టిన లాజిస్టిక్స్ సపోర్ట్ ఎక్సర్‌సైజులు చాలా వ్యూహాత్మకమైనవి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం వేళ వేగంగా దళాలకు అవసరమైన పరికరాలు , ఆహారం వంటివి సరఫరా చేయడం పైనా సాధన చేస్తున్నారు. ఈ విన్యాసాలు చేపట్టిన ప్రదేశం కూడా లద్దాఖ్‌ను ఆనుకొని ఉంది. ఇక్కడి వాతావరణం కారణంగా శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకొనేలా చైనా దళాలు ఎక్సోస్కెలిటెన్లు వినియోగించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News