Sunday, December 22, 2024

మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. 1962లో జరిగిందాన్ని ఇప్పటికీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మరచిపోలేరన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దులను కూడా సురక్షితం చేసిందని, ఇక దేశంలోకి చొరబాటులుండబోవని అన్నారు.

చైనా, భారత్ మధ్య మిలిటరీ ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ ఏ ప్రదేశాన్ని కూడా దేశం కోల్పోలేదని అమిత్ షా ఈ ఏడాది మొదట్లోనే స్పష్టం చేశారు.

పదేళ్ల మోడీ పాలనలో  అస్సాంలో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. మంచి పరివర్తన తీసుకొచ్చారన్నారు. రాబోయే సంవత్సరాలలో అస్సాం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలోనే భూమి పూజ జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరిగిందన్నారు.

లోక్ సభ తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న అస్సాం లోని లఖింపూర్ లో ఓటింగ్ జరుగనున్నది. రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ పోలింగ్ మే 7 న జరుగనున్నది. కాగా ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News