Saturday, November 16, 2024

కొత్తమ్యాప్‌కు చైనా సమర్ధన… “అతిగా అర్థం” చేసుకోవద్దని భారత్‌కు అభ్యర్థన

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా తాను విడుదల చేసిన 2023 కు సంబంధించి కొత్త “స్టాండర్డ్ మ్యాప్‌”ను బుధవారం సమర్ధించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ తమ భూభాగాలుగా చూపిస్తూ చైనా ఇటీవల 2023 కొత్త స్టాండర్డ్ మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇది చట్టప్రకారం జరిగిన ‘రొటీన్ ప్రాక్టీస్’ అని సమర్థించుకుంది. దీనిపై అతిగా అర్థంచేసుకోవద్దని భారత్‌ను చైనా అభ్యర్థించింది.

ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని వాదనలుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తిరస్కరించింది. “ ఇతర దేశ భూభాగాలు మీవని కేవలం అసంబద్ధ వాదనలు చేయడం మంచిది కాదు ” అని చైనాకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చురకలంటించారు. భారత దేశ దౌత్యపరమైన నిరసన గురించి స్పందన అడగ్గా ఇది చైనా సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ మాత్రమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ బుధవారం మీడియాతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News