Saturday, November 23, 2024

భూమి పొరల లోగుట్టు కోసం చైనా పట్టు

- Advertisement -
- Advertisement -

భూమి పొరల లోగుట్టుకోసం చైనా పట్టు
32808 అడుగుల లోతు బిలం
బీజింగ్ : మానవాళి ఉనికిని నిలిపే భూమి ఉపరితలం, అంతర్భాగ పొరలలోని విశేష రహస్యాలను ఛేదించేందుకు చైనా ఇప్పుడు భూలోక సొరంగ పనులలో పడింది. భూమి పొరల లోతుల లో తవ్వకాలు (డ్రిల్లింగ్) చేపట్టింది. భూమిని చీ లుస్తూ వెళ్లే ఈ రంధ్రం 10,000 మీటర్లు అంటే దాదాపు32,808 అడుగుల వరకూ ఉంటుంది. చైనాలోని చమురు నిక్షిప్త సంపన్నతల జిన్‌జియాంగ్ ప్రాంతంలో భారీ ఎత్తున ఈ పనులు చే పట్టారు. నిర్ణీత లక్షం మేరకు ఈ రం ధ్రాన్నితొలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది ని ర్థారణ కాలేదు.

భూమి స్వరూపం దీని విశేషాలు, పనిలో పనిగా అంతర్గత ఇప్పటివరకూ వెలికిలోకి రాని వనరులపై అన్వేషణలు జరిపితీరాలని ఇటీవలే చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ శాస్త్రజ్ఞులను కోరారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనితో ఇప్పుడు ఈ పని ఆరంభం అయిందని అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. చైనా రూపొందించే బిలం దాదాపు పది ఖండాలను అంతర్గతం గా పొరల్లో చీల్చుకుంటూ వెళ్లుతుంది. ప్రత్యేకిం చి భూ ఆవిర్భావానికి అత్యంత కీలకమైన క్రేటేసియస్ పొరను తాకుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News