Tuesday, November 5, 2024

ద్వారాలు తెరిచిన చైనా

- Advertisement -
- Advertisement -

తైపీ : చైనాకు వచ్చే ప్రయాణికులు ఇక కొవిడ్ లేదని తెలిపే పత్రం చూపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆంక్షలను సడలించారు. దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇది మైలురాయి అవుతుందని చైనా తెలిపింది. నెగెటివ్ కొవిడ్ సర్టిఫికెట్ రహిత ప్రయాణాలకు అనుమతిని ఇస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలో 2020 మార్చి నుంచి ఇతర దేశాల ప్రయాణికుల ప్రవేశంపై ఆంక్షలతో చైనా ఐసోలేషన్ సాగింది. ఈ మూడేళ్ల ఒంటరి దశ తరువాత ఇప్పుడు విదేశీయులకు చైనా ద్వారాలు ఎటువంటి కొవిడ్ రహిత నిర్థారణ పత్రాల అవసరం లేకుండానే తెరుచుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News