Monday, January 20, 2025

చైనాలో భూకంపం: 111 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 111 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి 200 మందికిపైగా గాయపడ్డారు.  చైనాలోని గన్సు, కింగ్ హై ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడుతున్నారు. భూమి కంపించగానే ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. కళ్ల ముందే కొన్ని వందల భవనాలు కూలిపోయాయని నెటిజన్లు ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News