Wednesday, January 22, 2025

చైనా భూకంపంలో 148 కి పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : వాయువ్యచైనాలో ఈ వారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 148 కి పెరిగింది. గన్సూ ప్రావిన్స్ మరీ దెబ్బతింది. అక్కడ 117 మంది వరకూ మృతి చెందారు. డిసెంబర్ 18 అర్ధరాత్రిలో 10 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమై విధ్వంసం సృష్టించింది. దాదాపు తొమ్మిదేళ్లలో ఇంటి భూకంపం సంభవించలేదు. గన్సుకు సరిహద్దు గల క్వింఘాయి ప్రావిన్స్‌లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

గన్సులో 781 మంది గాయపడ్డారు. గన్సులో భూకంప నిర్వాసితుల కోసం 311 తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు 1,12,346 మందికి పునరావసం కల్పించారు. ఇప్పటికి ఆస్పత్రిలో చికిత్స పొందినవారు 499 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 282 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News