- Advertisement -
బీజింగ్: పెళ్లి కాకున్నా…పిల్లల్ని కనేందుకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చట్టం, చట్టబద్ధత వంటివేవి అడ్డు కావిక. కారణం అక్కడ జననాల రేటు ఘోరంగా పడిపోయింది. ఇదివరకటి రూల్స్ అన్ని మార్చేసింది. పెళ్లి కాకున్నా పిల్లలను కనమని ప్రోత్సాహిస్తోంది. చైనాలో వయస్సు పైబడిన వారి సంఖ్య ఎక్కువ ఉండి, పనిచేయగల వయస్సు ఉన్న వారి సంఖ్య పడిపోతోంది. జననాల రేటు పెంచడానికి చైనా ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలు తేబోతోంది. జనాభా సమతుల్యతను కాపాడడానికి ఇప్పుడు చైనా తంటాలు పడుతోంది. ఇదివరలోనైతే జనాభాను అదుపుచేయడానికి ఒక కుటుంబానికి ఒకే సంతానం ఉండాలని నియమం పెట్టింది. ఇకపై పిల్లలను కనే వారు వివాహితులయినా, లేక ఒంటరి వారైనా వారికి ప్రసూతి బీమా, ప్రసూతి సెలవు, జీతం వంటివన్ని చైనా ఇవ్వబోతోంది.
- Advertisement -