Tuesday, January 21, 2025

చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కనుగొన్న చైనా

- Advertisement -
- Advertisement -

చంద్రుడి నుంచి భూమికి చాంగే 5 సాయంతో మట్టిని తీసుకువచ్చిన చైనా ఆ ఆనవాళ్లలో నీటి జాడ ఉన్నట్టు కనుగొన గలిగింది. ఈ ఆనవాళ్లపై గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. 2020లో చైనా చాంగే 5 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి నుంచి 2 కిలోల మట్టి, రాళ్లను తీసుకు వచ్చింది. అప్పటి నుంచి సాగించిన పరిశోధనల్లో ఆ నమూనాల్లో నీటి అణువులు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించినట్టు పేర్కొంది. అమెరికా, రష్యా వ్యోమగాములు కూడా 40 ఏళ్ల క్రితమే చంద్రుడి నుంచి నమూనాలను సేకరించి తీసుకు వచ్చారు. 2009 లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 వ్యోమనౌక చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్టు కనుగొనడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News