- Advertisement -
ఇస్లామాబాద్: అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు డ్రాగన్ కంట్రీ చైనా షాక్ ఇచ్చింది. సీపెక్ కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనాను సాయం అడిగింది. అయితే ఆ రిక్వెస్ట్ ను తాజాగా చైనా సర్కార్ తిరస్కరించింది. మరోవైపు పాక్ అప్పులు 2020 డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ మెత్తం పాక్ జిడిపిలో 109శాతంగా ఉంది. సీపెక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు 31 బిలియన్ డాలర్లకు మించిపోయింది. పాక్ విదేశీ అప్పులు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారస్ క్లబ్ నుంచి 11, వివిధ దేశాల నుంచి 33, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లలపైగా పాకిస్తాన్ ప్రభుత్వం సమీకరించింది. అంతేకాదు బాండ్ల రూపంలో అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. దీంతో పాక్ అప్పులు కొండల పెరుకుపోయాయి.
China Gives Shock to Pakistan
- Advertisement -