Saturday, November 16, 2024

సరిహద్దు సమీపంలో చైనా బంకర్లు, సొరంగాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తర లద్దాఖ్ లోని సరిహద్దు సమీపం లో చైనా అనేక సొరంగాలు, బంకర్లు , రోడ్లు నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఇది తమ ప్రాంతమంటూ చైనా పేర్కొంటున్న అక్సాయ్‌చిన్ లోనే ఇవి ఉండటం కలవరపెట్టే విషయం. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ రూపొందించిన మ్యాప్‌ను చైనా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అక్సాయ్ చిన్ ప్రాంతం లోనే అనేక పటిష్ఠమైన బంకర్లు,

సొరంగాల నిర్మాణం చేపట్టినట్టు మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటితోపాటు రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు సొరంగాల ప్రవేశం వద్ద నిర్మాణసామగ్రి భారీ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. అక్సాయ్‌చిన్‌లో భారత్ వాయుసేనకు ఉన్న సానుకూలతలు , ఒకవేళ దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే చైనా అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండటం భారత్‌కు ఆందోళనకరమైన అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News