Friday, December 20, 2024

చైనాలో కుంగిన రోడ్డు.. 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : దక్షిణ చైనా లోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంతభాగం కుప్పకూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంతభాగం బుధవారం తెల్లవారు జామున 2.10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు , అధికారులు వెంటనే స్పందించి దాదాపు 500 మంది సిబ్బందితో రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారిలో 19 మంది మృతి చెందారు. మరోముప్పై మంది తీవ్రంగా గాయపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో అకస్మాత్తుగా రోడ్డు నేల లోకి దిగబడి పోవడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు లోతైన గోతిలో పడిపోయాయి. అందులోంచి మంటలు, పొగలు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఇటీవల విపరీతమైన వాతావరణ మార్పులు , వరదలు, సుడిగాలులు, సంభవించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News