Wednesday, November 6, 2024

చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే : జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ, భారత్, చైనా మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. హిమాలయ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం.. అసాధారణ , సవాళ్ల దశకు చేరుకుందని తెలిపారు. ఢిల్లీలో శనివారం జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“ భారత్, చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో ఇరు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయి. ఇతర ఘర్షణ ప్రాంతాల వద్ద సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ హిమాలయాల్లోని సరిహద్దుల్లో చైనాతో పరిస్థితులు ఇప్పటికీ పెళుసుగా ప్రమాదకరంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. ” అని జైశంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బంధం ముందుకెళ్లాలంటే ఈ సరిహద్దు ప్రతిష్టంభనను చైనానే పరిష్కరించాలని కేంద్ర మంత్రి తెలిపారు.

రాహుల్‌పై విమర్శలు

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చైనాను చూసి భయపడుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటుగా స్పందించారు. “ చైనాపై రాహుల్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదో పెద్ద తయారీదారు అని, మేక్ ఇన్ ఇండియా పనిచేయదని విమర్శిస్తున్నారు. ఒక దేశం గురించి ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ జాతి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదు. అలాంటి వారిని చూసినప్పుడు ఓ భారతీయుడిగా నేను ఇబ్బంది పడుతున్నా” అని విదేశాంగ మంత్రి రాహుల్‌ను దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News