Tuesday, November 5, 2024

చైనాలో భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

China launches 2 units of world's largest hydropower station

 

బీజింగ్: చైనా నైరుతి ప్రాంతంలో 34 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ప్రపంచం లోనే అత్యంత భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లను సోమవారం చైనా ప్రారంభించింది. బైహెటన్ పేరు గల ఈ జల విద్యుత్ కేంద్రం యాంగ్‌ట్జే నదికి ఎగువ భాగాన జిన్షా నదిపై నిర్మాణం అవుతోంది. జులై 1 న పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి )శతాబ్ది వేడుకలు జరగనున్న సందర్భంగా అంతకు ముందే ఈ యూనిట్లను ప్రారంభించడం విశేషం. యాంగ్‌ట్జే నదిపై ఇదివరకే త్రీగోర్జెస్ డ్యామ్‌ను చైనా నిర్మించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌కు అతి చేరువగా టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ డ్యామ్ నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ డ్యామ్‌ల నిర్మాణ వ్యయం 220 బిలియన్ యుయాన్ (34 బిలియన్ డాలర్లు). మొత్తం 16 మిలియన్ కిలోవాట్ల సామర్ధంతో రూపొందుతున్న బైహెటన్ జలవిద్యుత్ కేంద్రానికి 16 హైడ్రోజెనరేటింగ్ యూనిట్లు ఉంటాయి. ఒక్కో దాని సామర్థ్యం మిలియన్ కిలో వాట్లు. ప్రపంచం లోనే ఏకైక అతిభారీ విద్యుత్ కేంద్రంగా చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News