బీజింగ్: చైనా శనివారం మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ జిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించింది. యోగాన్ 35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను లాంగ్ మార్చ్ 2డి రాకెట్ విజయవంతంగా తీసుకెళ్లినట్టు చైనా అధికారిక మీడియా పేర్కొంది. లాంగ్‌మార్చ్ సీరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396 వి మిషన్‌గా తెలిపింది. 2019 మార్చిలో లాంగ్ మార్చి 3బీ రాకెట్ విజయవంతంగా నింగి లోకి దూసుకెళ్లింది. చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300 వ ప్రయోగంగా అది నిలిచినట్టు పేర్కొంది. లాంగ్ మార్చ్ వాహక రాకెట్ సిరీస్‌ను చైనా ఎయిరో స్పేస్ అండ్ టెక్నాజలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో ఈ రాకెట్ల ద్వారానే 96.4 శాతం పూర్తి చేయటం గమనార్హం. తొలి వంద ప్రయోగాలకు 37 ఏళ్లు పట్టగా, తదుపరి వందకు 7, 5 ఏళ్లు, ఆ తర్వాత నాలుగేళ్ల లోనే మరో వంద ప్రయోగాలను చైనా చేపట్టింది.
China launches 3 new remote sensing satellites