Saturday, January 18, 2025

రోదసిలోకి పాకిస్థాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

- Advertisement -
- Advertisement -

జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి శుక్రవారం పాకిస్థాన్ ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. పిఆర్‌ఎస్‌సిఈవో1 పేరుతో ఉన్న ఆ ఉపగ్రహాన్ని బీజింగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.07 గంటలకు ప్రయోగించింది. లాంగ్ మార్చ్2డి క్యారియర్ రాకెట్ ద్వారా అంతరిక్ష కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఆ రాకెట్ ఇంకా టియాన్లు1, లాంటన్1ను కూడా నింగిలోకి మోసుకెళ్లింది.

చైనా లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ సీరీస్‌లో ఇది 556వ ఫ్లయిట్ మిషన్. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ ఉపగ్రహాలను చైనా ప్రయోగిస్తూ వస్తోంది. చైనాపాకిస్థాన్ స్నేహ సంబంధాలు ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాల వరకు చేరాయి. గత ఏడాది పాకిస్థాన్ మల్టీ మిషన్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కూడా చైనా ప్రయోగించింది. 2018లో రెండు పాకిస్థాన్ ఉపగ్రహాలను చైనా కక్షలోకి ప్రవేశపెట్టింది.అవి: పిఆర్‌ఎస్‌ఎస్1, పాక్‌టిఈఎస్1ఏ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News