- Advertisement -
బీజింగ్: నైరుతి నగరమైన చెంగ్డూలో కోవిడ్-19 విజృంభించడంతో 21 మిలియన్లు ఉన్న ఆ నగరాన్ని చైనా లాక్డౌన్ చేసింది. నివాసితులు ఇండ్లలోనే ఉండాలని ఆదేశించింది. ఆ నగరం నుంచి 70 శాతం విమానాలను రద్దు చేసింది. సియాచున్ ప్రాంతానికి ఆ నగరమే ప్రధాన రవాణా కేంద్రం. ప్రత్యేక అవసరముంటేనే ఆ నగరం నుంచి వెళ్లడానికి అనుమతిని ఇస్తున్నారు. 24 గంటలలో ఎవరికైతే నెగటివ్ రిపోర్టు వచ్చిందో అలాంటి కుటుంబానికి చెందిన సభ్యులనే నిత్యావసరాలు కొనుక్కునేందుకు వదులుతున్నారు. ఇక లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారన్నదానిపై ఎలాంటి మాట లేదు. చెంగ్డూ నగరంలో తాజాగా 1000 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -