Monday, December 23, 2024

మ్యాప్ వివాదంపై మళ్లీ చైనా పాతపాట

- Advertisement -
- Advertisement -

బీజింగ్: సరిహద్దుల విషయంలో భారత్‌పై పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బైటపెట్టుకుంది.అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా విడుదల చేసిన మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందిస్తూ చైనా మళ్లీ పాతపాటే పాడింది. ఇదంతా చట్ట ప్రకారమే జరిగిందంటూ తన చర్యను సమర్థించుకుంది.023 సంవత్సరానికి సంబంధించి చైనా సోమవారం విడుదల చేసిన ఓ స్టాండర్డ్ మ్యాప్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటుగా అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్, తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్‌లో పేర్కొంది.

దీంతో ఈ మ్యాప్‌పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది సరిహద్దు సమస్యను మరింత రగల్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా మ్యాప్‌ను చైనా రూపొందించిందని మండిపడింది. దీనిపై దౌత్యపరమైన మార్గాల్లో చైనాకు భారత్ గట్టి నిరసన తెలియజేసినట్లు భారత విదేశాంగ శాఖ కార్యర్శి అరిందమ్ బాగ్చీవెల్లడించారు. ఈ నేపథ్యంలో మ్యాప్‌పై భారత మీడియాలో వస్తున్నవార్తలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బుధవారం స్పందించారు. ‘2023 స్టాండర్డ్ మ్యాప్ విడుదల చట్టప్రకారం జరిగిందే. దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ మాత్రమే.దీన్ని సంబంధిత వర్గాలు (భారత్‌నుద్దేశిస్తూ)నిష్పక్షపాతంగా పరిగణిస్తాయని, అతిగా అర్థం చేసుకోవని ఆశిస్తున్నాం’ అంటూ మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. కాగా డ్రాగన్ తాజా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News