Sunday, December 22, 2024

చైనా సబ్‌మెరైన్ మునక..

- Advertisement -
- Advertisement -

లండన్ : చైనాకు చెందిన అణు చోదక జలాంతర్గామి ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో 55 మంది వరకూ చైనా నావికా సిబ్బంది ఊపిరి ఆడని స్థితిలో మృతి చెందారు. ఆగస్టు 21న ఈ ఘటన జరిగింది. చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్ 093417 ఎల్లోసీలో మునిగిపోయిందని బ్రిటన్ మీడియా ఇప్పుడు వార్తలు వెలువరించింది. అమెరికా, బ్రిటన్ నౌకలపై నిఘా వేసేందుకు ఈ సబ్‌మెరైన్ వెళ్లుతూ ఉండగా యాంత్రికలోపాలతో ఇది మునిగిపోయిందని వార్తల్లో తెలిపారు. అయితే ఇటువంటిదేమీ లేదని చైనా ఈ వార్తలను ఖండించింది.

తైవాన్ కూడా ఈ వాదనను బలపర్చింది. అయితే ఈ అణు జలాంతర్గామి నీటమునిగిన ఘటనలో అణుధార్మిక పదార్థాలు లీక్ అయినట్లు బ్రిటిష్ ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. సబ్‌మెరైన్‌లో లోపాలతో చివరికి ఈ సబ్‌మెరైన్ సిబ్బంది విషవాయువులు పీల్చుకోవల్సి వచ్చిందని , ఈ క్రమంలో పలువురు మృతి చెందారని బ్రిటన్ మీడియా తెలలిపింది. కెప్టెన్, 21 మంది అధికారులు జలసమాధి అయినట్లు మీడియా తెలిపింది. చైనా బలగాలే ఏర్పాటు చేసిన సముద్ర అంతర్బాగ కంచెలలో చిక్కి సబ్‌మెరైన్ పతనం అయినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News