Friday, November 22, 2024

బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

China parliament approves construction of dam on Brahmaputra

బీజింగ్ : అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న టిబెట్ లోని బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణానికి గురువారం చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనకు భారత్, బంగ్లాదేశ్, తదితర నదికి ఆనుకుని ఉన్న దేశాలు అభ్యంతరం లేవదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అభ్యంతరాలను చైనా పట్టించుకోలేదు. తమ ప్రయోజనాల కోసం ఈ ఆనకట్ట నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. 14 వ పంచవర్ష ప్రణాళిక కింద బ్రహ్మపుత్రపై వివాదాస్పద హైడ్రో పవర్ ప్రాజెక్టుతో సహా అనేక కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు గురువారం చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధాని లి కెకియాంగ్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. 2035 నాటికి ఆర్థిక సామాజిక పురోగతి సాధించాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందింది.

China parliament approves construction of dam on Brahmaputra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News