Wednesday, November 6, 2024

చైనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆ దేశంలోకి అనుమతి

- Advertisement -
- Advertisement -

China Permit to People Return if They Take Chinese Vaccines

 

భారత్‌సహా 20 దేశాలకు నిబంధన

న్యూఢిల్లీ: చైనా వెళ్లాలనుకుంటే భారత్‌సహా 20 దేశాలకు చెందినవారు ఆ దేశ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని నిబంధన విధించింది. చైనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపిస్తేనే తమ దేశంలో ప్రవేశించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు ఢిల్లీలోని చైనా రాయాబార కార్యాలయం తన నోటీస్‌లో పేర్కొన్నది. మార్చి 15 నుంచి దేశాల మధ్య రాకపోకల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయంలో భాగంగా ఈ నోటీస్ జారీ చేసింది. చైనా విధించిన ఈ నిబంధన అక్కడ విద్యాభ్యాసం చేస్తూ కరోనా కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయిన 23,000మందికిపైగా విద్యార్థులపై ప్రభావం చూపనున్నది. వీరిలో అధికభాగం వైద్య విద్యార్థులే. వీరేగాక వందలాది భారత వృత్తి నిపుణులు చైనాలో పని చేసేవారున్నారు. వారంతా ఇప్పుడు ఇక్కడే ఉండిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన ఆస్ట్రాజెనెకా టీకా కోవీషీల్డ్‌లాంటి వాటికి కూడా చైనా అనుమతించకపోవడం గమనార్హం. మరోవైపు చైనా టీకాలు భారత్‌లో అందుబాటులో లేవు. దీనికి పరిష్కారమేమిటన్నది భారత విదేశాంగశాఖ ముందున్న ప్రశ్న.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News