Monday, December 23, 2024

పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లను మోహరించిన చైనా!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: టిబెట్ ఎయిర్‌ఫీల్డ్‌లో చైనా పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లను, హెలికాప్టర్లను, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌లను, ఆకాశంలోనే విమానాలకు ఇంధనం నింపుకునేలా మూడు ఎయిర్‌ఫీల్ట్‌లను మోహరించింది. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ యుఎవిలను లాసా వద్ద కనిపించాయి. వివిధ రకాల యుద్ధవిమానాలను… జె10 విగోరస్ డ్రాగన్స్, మల్టీరోల్ ఫైటర్లు, పది షెన్‌యాంగ్ జె11లు, రష్యన్ సు27కు ధీటైన ట్విన్ ఇంజిన్ ఫైటర్లు, మిగ్21కు ధీటైన రెండు జె7 విమానాలను మోహరించింది. లద్దాఖ్‌ను దృష్టిలో పెట్టుకునే చైనా సంసిద్ధంగా ఉంది. రెండేళ్ల క్రితమే చైనీయులు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారతీయ జవానులతో తలపడ్డారు. తర్వాత ఉద్రిక్తత తగ్గింపు ప్రక్రియలో చైనీయులు తమ పూర్వ స్థానాలకు వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News