Saturday, December 28, 2024

బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచ అతి పెద్ద డ్యామ్ నిర్మిస్తాం: చైనా

- Advertisement -
- Advertisement -

టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యామ్ నిర్మించబూనడాన్ని చైనా శుక్రవారం సమర్థించుకుంది. నది నీరు ప్రవహించే పరిసర రాష్ట్రాల్లో భద్రత సమస్యలు దృష్టిలో ఉంచుకునే నిర్మాణం చేపడతానని స్పష్టం చేసింది. ఇందుకు దశాబ్దాలుగా అధ్యయనం చేసినట్లు పేర్కొంది. 137 బిలియన్ అమెరికా డాలర్లతో నిర్మించే ఈ డ్యామ్ విషయంలో ఎలాంటి భయాందోళనలను పెట్టుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. సురక్షణ విషయంలో దశాబ్దాలుగా లోతైన అధ్యయనాలు చేసినట్లు కూడా ఆమె పేర్కొన్నారు. టిబెట్‌లో హైడ్రో పవర్ అభివృద్ధిపై, రక్షణ చర్యలపై దశాబ్దాలుగా అధ్యయనాలు చేపట్టినట్లు తెలిపారు.

లోతట్టు ప్రాంతాలలో ఈ ప్రాజెక్టు ఎలాంటి నష్టం కలిగించబోదని ఆమె స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలున్న దేశాలతో చైనా ఈ విషయంలో చర్చలు కొనసాగించగలదన్నారు. ఇదిలావుండగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా బుధవారం ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టు కాగలదని పేర్కొంది. డిసెంబర్ 18న సీమాంతర సరిహద్దు నదుల విషయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో చోటుచేసుకుంది. కాగా భూకంపాలు సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఈ ప్రాజెక్టు సైట్ ఉండడం వల్ల అనేక ఇంజనీరింగ్ సవాళ్లను లేవనెత్తగలదని భావిస్తున్నారు. టిబెట్ పీఠభూమిని ‘ప్రపంచ పై కప్పు’(the roof of the world)గా పరిగణిస్తుంటారు. టెక్టోనిక్ ప్లేట్‌లో ఈ ప్రాంతం ఉన్నందున ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News