Monday, December 23, 2024

కొండల్లో కూలిన చైనా విమానం.. 132మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

China plane crashes in hills 132 killed

బీజింగ్ : చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో కున్మింగ్ సిటీ నుంచి గ్వాంగ్జౌ ప్రాంతానికి బయలుదేరిన 737 బోయింగ్ విమానం గాలిలో మెలికలు తిరుగుతూ తల్లకిందులుగా కొండల్లో కుప్ప కూలింది. ప్రమాదం  జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమాన శకలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దుర్ఘటన సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9మంది సిబ్బంది ఉన్నారు. అందరూ మరణించి ఉంటారని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్నట్లు పౌర విమానయాన అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పూర్తి స్థాయిలో నిర్థారణ కాలేదని అధికార వార్తాసంస్థలు తెలిపాయి. బోయింగ్ 737 విమానం కున్మింగ్ సిటీ నుంచి దక్షిణాదిలోని గ్వాంగ్జౌకు బయలుదేరిన తరువాత విమానానికి గ్రౌండ్ కంట్రోలు రూంతో సంబంధాలుల తెగిపోయాయి.

గ్వాంగ్జౌ ప్రాంతంలోని వుజోహు నగరం వద్ద ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. విమానం కూలిన ప్రాంతానికి హుటాహుటిన అత్యయిక సహాయక బృందాలను పంపించారు. టెంగ్ కౌంటీ ప్రాంతంలో విమానం కుప్పకూలిందని, ఈ ఘటన తరువాత అక్కడ మంటలు చెలరేగాయని అధికారిక సిసిటివి తెలిపింది. ఇక్కడి పర్వతప్రాంతంలోనే విమానం కూలిందని, వెంటనే మంటలు వ్యాపించాయని స్థానిక గ్రామస్తుడు ఒకరు తెలిపారు. చైనాలో అత్యంత అరుదుగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ వైమానిక ప్రయాణ భద్రతకు సంబంధించి ఇటీవలి కాలంలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. పలు చోట్ల నూతన విమానాశ్రయాలు నిర్మితం అయ్యాయి. పలు విమానయాన సంస్థలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా భద్రతాయుత రీతిలో విమానాల ప్రయాణాలను నిర్వహిస్తున్నారు.

ఘటనపై దేశాధ్యక్షుడి దిగ్భ్రాంతి, దర్యాప్తు ఆదేశాలు

చైనాలో విమాన దుర్ఘటనపై దేశాధ్యక్షులు జి జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. ఇప్పుడు ప్రమాదానికి గురై పతనం చెందిన విమానం పాతరకం అని వెల్లడైంది. బోయింగ్ మాక్స్ జెట్ శ్రేణి ఇంతకు ముందు కొన్ని ప్రమాదాలను మిగిల్చింది. అయితే ఇంజిన్‌లోకొన్ని మార్పులు చేసి ఈ రకం వాటిని నడిపిస్తున్నారు.

కొండలపైకి వేగంగా దూసుకువెళ్లి పతనం

చైనా గ్రామీణ ప్రాంతాలలో సోమవారం కుప్పకూలిన బోయింగ్ విమానం తుదిక్షణాలను తెలిపే వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ కెమెరా నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించారు. విమానం ఆకాశంలో వెళ్లుతూ ఉన్నట్లుండి నేలపైకి వేగంగా దూసుకువచ్చినట్లు, కొండలపై కుప్పకూలినట్లు ఈ దృశ్యాలతో స్పష్టం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News