Wednesday, January 22, 2025

మరో ఆరేళ్లలో చంద్రునిపై చైనా అణుశక్తి ఆధారిత స్థావరం !

- Advertisement -
- Advertisement -

 

బీజింగ్ : మరో ఆరేళ్లలో చంద్రునిపై అణువిద్యుత్ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్టు చైనా వెల్లడించింది. చైనా లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ చీఫ్ డిజైనర్ వు వియ్‌రాన్ .. ప్రభుత్వ అధికారిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోఈ విషయాన్సి స్పష్టం చేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సిఎంపి) తన నివేదికలో పేర్కొంది.

వచ్చే పదేళ్లలో తమ వ్యోమగాములు చంద్రుడి పైకి చేరుకుంటారని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ల్యాండర్, హాపర్, ఆర్బిటర్, రోవర్ అనే నాలుగు కీలక భాగాలుంటాయని వివరించారు. అణుశక్తి ఆధారిత స్థావరం ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దాంతో ఒక ఏడాదిపాటు వందలాది ఇళ్లకు విద్యుత్ అందజేయవచ్చని ఎస్‌సిఎంపి తన నివేదికలో పేర్కొంది. అణుశక్తితో వెలువడే విద్యుత్‌తో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని, చంద్రుడిపై వివిధ పరికరాలను ఆపరేట్ చేయవచ్చని , నీటిని వెలికి తీయవచ్చని చైనా అంచనా వేస్తోంది.

మొత్తానికి 2028 నాటికి చందమామపై చైనా అణువిద్యుత్ ఆధారిత స్థావరం పూర్తి కానున్నదని ఎస్‌సిఎంపి వెల్లడించింది. ఆలోగా చంద్రుడిపై నీటి జాడలు, ఇతర అంశాలను అధ్యయనం చేయడం కోసం మానవ రహిత లూనార్ మిషన్స్‌ను ప్రయోగించాలని చైనా భావిస్తోంది. చంద్రుడి మీది వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనాలు ఎన్నో ఏళ్లుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News